వేద న్యూస్,మిర్యాలగూడ ప్రతినిధి :
మిర్యాలగూడ డివిజన్ ఫోటో, వీడియో గ్రాఫర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థాయి క్రీడా పోటీలు స్థానిక క్లియోస్పోర్ట్స్ మైదానంలో ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బిఎల్ఆర్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్,డిఎస్పి రాజశేఖర్ రాజు ముఖ్య అతిథులుగా పాల్గొనగా గౌరవ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ప్రారంభించడం జరిగింది. ఉమ్మడి నల్గొండ జిల్లా స్థాయి లో క్రికెట్ క్యారం బోర్డు,బ్యాడ్మింటన్,కబడ్డీ పోటీలకు వివిధ మండలాల నుంచి,ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఫోటోగ్రాఫర్లను ఆహ్వానించడం జరిగింది. ఈ క్రీడా పోటీలను డాగురె చిత్రపటానికి పూలమాలవేసి,జండా ఊపి ప్రారంభించడం జరిగింది.ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే బిఎల్ఆర్,డిఎస్పి రాజశేఖర్ రాజు మాట్లాడుతూ అనునిత్యం వివాహాది శుభకార్యాలతో బిజీగా గడిపే ఫోటోగ్రాఫర్లు ఈ విధమైన స్నేహపూర్వకమైన క్రీడా పోటీలను జరపాలనుకోవడం ఎంతో సంతోషదాయకమని,ఈ పోటీలు ఫోటోగ్రాఫర్లు మానసిక ఉల్లాసానికి, ఉమ్మడి జిల్లా స్థాయిలో ఫోటోగ్రాఫర్ల మధ్య స్నేహభావం పెంపొందించుకోవడానికి ఉపయోగపడతాయనీ, ఈ క్రీడా పోటీలు స్నేహపూర్వక వాతావరణం లో జరగాలని, బేషజాలకు తావు లేకుండా ఉండాలని వారు సూచించారు.ఈ కార్యక్రమంలో ఫోటోగ్రఫీ రాష్ట్ర నాయకులు మరి ఎలియాస్, మిర్యాలగూడ డివిజన్ అధ్యక్షుడు చక్రి, నల్గొండ జిల్లా అధ్యక్షుడు కృష్ణ,జిల్లా మాజీ అధ్యక్షుడు శ్రీమన్నారాయణ, పందిరి లక్ష్మణ్,నాగార్జున,సంఘీ ఎంకన్న, కర్ర శ్రీనివాస్ రెడ్డి, అభినవ్,కొత్తపల్లి సైదులు, సిపాయి నాయక్,కనకా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.