వేద న్యూస్,ఇల్లంతకుంట,

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పలు ఆర్ఓ కేంద్రాలను జిల్లా సాధారణ పరిశీలకులు రవి కుమార్ మంగళవారం తనిఖీ చేశారు. ఇల్లంతకుంట మండలంలోని పొత్తూరు, పెద్దలింగాపూర్ గ్రామాల్లోని నామినేషన్ కేంద్రాలను జిల్లా సాధారణ పరిశీలకులు పరిశీలించారు. ఆయా ఆర్ ఓ కేంద్రాల్లో నామినేషన్లు, హెల్ప్ డెస్క్ ఇతర ఏర్పాట్లను పరిశీలించి, సూచనలు చేశారు.
కార్యక్రమంలో ఇల్లంతకుంట ఎంపీడీఓ శశికళ సిబ్బంది ఉన్నారు.