people force Archives - VEDHA NEWS

స్వప్నించిన దేహాలు ధ్వంసమవుతున్న వేళా…!?
దారులన్నీ మూసుకుపోయినప్పుడు మార్గం మార్చుకోకపోతే ఫలితం ఏముంటుంది..? తమకు విశ్వాసం ఉన్నప్పుడు, లక్ష్యం చేరుకోవడానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయని భావించిన కాలంలో చావటానికైనా సిద్ధపడ్డారు.

ప్రస్తుతం ఆ త్యాగాలతో ఫలితం రాదని అర్థం అయినప్పుడు, అనవసర త్యాగాలు ఆత్మహత్యలతో సమానమని భావించినప్పుడు ప్రత్యామ్నాయం వైపు అడుగులు వేయడం సరైనదని భావించకపోవడమంటే ఆ చర్య యుద్ధ వ్యూహాం లేకపోవడమే అవుతుంది కదా..? చాలా ఫీక్ స్థాయిలో స్వప్నించిన దేహాలు ధ్వంసమవుతున్న వేళా మావోయిస్టులు మార్గం మారతుండటాన్ని నిందించడం కంటే స్వాగతించడం చారిత్రిక అవసరం.

ఆపరేషన్ కగార్ పేరుతో సాగుతున్న మారణ హోమంలో మావోయిస్టులపై పాలకులు పైచేయిగానే ఉన్నారనేది చాలా స్పష్టం. 2026, మార్చి నెలాఖరు నాటికి మావోయిస్టులను శాశ్వతంగా నిర్మూలించి.. మావోయిస్ట్ రహిత భారత్‌గా మారుస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించి అందుకు కట్టుబడి ఇప్పటికీ ముందుకు సాగుతున్నది.

ఈ నేపథ్యంలో మావోయిస్టు పార్టీ సూఫ్రీం నంబాల కేశవరావుతో సహా కీలక నేతలు హతం కాబడ్డారు. దీంతో తదనంతర పరిణామాలు చాలా మారుతూ వచ్చాయి.‌ మావోయిస్టు పార్టీలోనూ చర్చలు ఆలోచనలు జరిగినట్లు ఆ పార్టీ కీలక నేతలు ఎంచుకున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ పరిణామాలు బహిరంగ రహస్యమే.

ఇక మావోయిస్టులు లొంగిపోయి.. జన జీవన స్రవంతిలో కలిసిపోవాలని కేంద్రం సైతం పిలుపునిచ్చింది. దాంతో వందల సంఖ్యలో మావోయిస్టులు ప్రభుత్వం ఎదుట లొంగిపోతున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. దేశంలోని ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, జార్ఖండ్ మినహా మిగతా అన్ని రాష్ట్రాలు మావోయిస్టు రహితంగా మారాయనే చర్చలు సాగుతున్నాయి.

ఇంకోవైపు తాజాగా మావోయిస్టు పార్టీలో అగ్రనేతగా ఉన్న మల్లోజుల వేణుగోపాల్ దాదాపు వంద మంది మావోయిస్టులతో కలిసి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట, అలాగే ఛత్తీస్‌గఢ్ సీఎం ఎదుట మరో మావోయిస్టు అగ్రనేత ఆశన్న సైతం వందల మందితో కలిసి లొంగిపోయరు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి మావోయిస్టులు ఆయుధాలను అప్పగించారు.

అయితే మల్లోజుల వేణుగోపాలు, ఆశన్నలు ప్రభుత్వం ఎదట లొంగిపోయిన తీరుపై మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటి లేటర్ల పర్వం కొనసాగి చర్చకు తెరలేపింది. దీంతో వాళ్ల లొంగుబాటు పద్ధతిపై కొంత అసహనం వ్యక్తం చేసిన వారూ ఉన్నారు.

ఈ కొనసాగింపులోనే మరో ఇద్దరు అగ్రనేతలైనటువంటి చంద్రన్న, బండి ప్రకాష్ కూడా తెలంగాణ ప్రభుత్వం ఎదుట లొంగిపోయారు.

ఆయుధాలు పార్టీకి అప్పగించి అనారోగ్య సమస్యల వల్ల జనంలోకి వచ్చామని ప్రజాస్వామ్య బద్ధంగా ప్రజల్లో ఉంటూ ప్రజల కోసం పనిచేస్తామని చంద్రన్న ప్రకటించారు. మావోయిస్టు పార్టీని సపోర్ట్ చేస్తున్నట్లు కూడా ప్రకటించారు చంద్రన్న.

ఇక మల్లోజుల వేణుగోపాల్, ఆశన్నలను విద్రోహులంటూ చర్చలు, అవాకులపై ఆశన్న చాలా హూందాగా, చెప్పాల్సిన పద్దతిలో తమ వీడియో వాయిస్ ద్వారా క్లారిటీ కూడా ప్రకటించారు. ఈ జరుగుతున్న తీరు అందరికీ తెలిసిందే.

అయితే ఇక్కడ చర్చ అంతా మావోయిస్టులు అడవులు వీడటమే సరైనది కాదనే పద్దతిలో చర్చలు సాగుతున్న తీరుపైనే. మావోయిస్టులు అడవుల్లోనే ఉండాలి. అక్కడే చనిపోవాలి. అదే అసలైన విప్లవం, అదే అసలైన త్యాగం అనే తరహాలో చర్చలు కొనసాగించే వారూ లేకపోలేదు. అడవులు వీడటం ముమ్మాటికి విప్లవ ద్రోహమంటూ వారిపై మండిపడినవారూ ఉన్నారు.

అయితే కనీసం ప్రతిఘటించే పరిస్థితుల్లో కూడా మావోయిస్టు పార్టీ లేదని పరిస్థితులు, విశ్లేషణలు తేటతెల్లం చేస్తున్న విషయాన్ని పరిగణలోకి తీసుకోకుండా చర్చలు సాగించడం జ్ఞానవంతులు అసలు విషయాన్ని దాటవేయడమే అవుతుంది.

అసలు దేశంలో సాయిధపోరాటానికి అవకాశం ఉందా..? అనే అంశం కాకుండా ఇతర అంశాల చుట్టు చర్చల రాద్దాంతం సాగించడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు.

ఇక సాయుధ మార్గాన్ని వీడి ఎన్నికల్లో పాల్గొంటున్న పార్టీలు ప్రజల్లో నిలబడుతున్న సత్యం కనబడుతూనే ఉంది. నేపాల్ మావోయిస్టులు ప్రచండ నేతృత్వంలో సాయుధ మార్గం వీడి ఎన్నికల్లోకి వచ్చారు. అధికారాన్ని చేపట్టారు. ప్రస్తుతం అధికారంలో లేకపోయినా ప్రజల్లో ఉన్నారు. మనదేశంలోనూ సీపీఐ ఎంఎల్ లిబరేషన్ లాంటి పార్టీ తమ పంథాను మార్చుకొని బిహార్, జార్ఖండ్ లాంటి రాష్ట్రాల ఎన్నికలో పోటీ చేస్తున్నారు.

ఎమ్మెల్యే, ఎంపీలుగా గెలుస్తున్నారు. ఇతర అనేక రాష్ట్రాల్లోనూ ఈ పార్టీ విస్తరిస్తోంది. మన తెలంగాణలోనూ కొన్ని ఎంఎల్ పార్టీలు ఎన్నికల్లో పోటీ చేసి మనుగడ సాగిస్తున్న విషయం మరువద్దు. సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ లాంటి పార్టీ ఎన్నికల్లోకి వచ్చి గుమ్మడి నర్సయ్య లాంటివారు ఎమ్మెల్యేగా సుదీర్ఘకాలం ప్రజల మనిషిగా ఉన్నారు. ఇవి మచ్చుకు మాత్రమే. సాయుధ మార్గం వీడి ప్రజల్లోకి వచ్చి ఎన్నికల పంథాను అనుసరించిన పార్టీలు ఫలితాలు సాధిస్తున్నాయి. ఇవన్నీ చరిత్ర రుజువు చేస్తున్నది.

ప్రజలు అడవుల్లో లేరని మావోయిస్టు పార్టీలోని కొందరు కీలకనేతలు గ్రహించారేమో..! అందుకే తమ యుద్ధ వ్యూహం మార్చుకున్నారేమో..! ప్రజా ప్రయోజనాలకు ఉపయోగపడని ఆ పోరులో ప్రజలు భాగస్వామ్యం అయ్యే పరిస్థితి లేని సాయుధ మార్గం ప్రయోజనం లేదనే వాస్తవాన్ని గ్రహించారేమో..

అందుకే సాయుధ మార్గం వీడుతున్నారేమో… ఇలాంటి తరుణంలో అడవిని వీడిన నేతలు తమ దారిలో తమతమ పద్దతుల్లో ప్రజల కోసం పనిచేస్తామని ప్రకటిస్తూనే ఉన్నా విషయాన్ని కనీసం పరిగణలోకి తీసుకోకుండా సాయుధ పోరాటాన్ని విసర్జించి బయటికి వచ్చిన వారిని అవమానపరిచేలాగా, అవహేళన చేసే లాగా మాట్లాడటం, తప్పుడుగా దుష్టచారం చేయడం సరైనది కాదు. మావోయిస్టు పార్టీని వీడిన వారుసైతం జనోపకార కార్యాచరణ, ప్రజల విశ్వాసాన్ని పొందేలా ప్రణాళిక ప్రకటించి ముందుకు సాగకపోతే చరిత్ర క్షమించదని వారికి తెలుసు అనే ఆశీద్దాం..! బయటకొచ్చిన వారిని నిందించటం కంటే స్వాగతిద్దాం..!!

– దామెర రాజేందర్ (దారా)

సీనియర్ జర్నలిస్ట్

The post స్వప్నించిన దేహాలు ధ్వంసమవుతున్న వేళా…!? appeared first on VEDHA NEWS.