హైదరాబాద్ క్రైమ్, వేద న్యూస్:

ప్రస్తుతం సమాజం ఎటువైపు వెళ్తుందో అర్ధంకాని పరిస్థితి. మానవత్వం మంటగలిసిపోతుంది. ముఖ్యంగా ఆడపిల్లలకు రక్షణ అనేది కరవు అవుతుంది. ఒంటరికిగా బయటకి వెళ్తే.. మానవ రూపంలో ఉన్న ఏ మృగం దాడి చేస్తుందో తెలియదు. మానవ మృగాల నుంచి రక్షించాల్సిన కన్నవారే ఆడబిడ్డలపై అత్యాచారం కొంతమంది చేస్తుంటే..ఇంటిపట్టున ఉన్న వాళ్లపై నిఘా పెట్టి మరీ అఘాయిత్యాలకు పాల్పడుతున్న వారు మరికొందరు. ఇలాంటి ఘటనే తాజాగా రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.
రంగారెడ్డి జిల్లా పీరంచెరువు గ్రామంలో ఓ వివాహితను కిడ్నాప్ చేసి కారులో ఎక్కించారు. అనంతరం ఆమెను ఓ నిర్మానుష్యప్రాంతానికి తీసుకువెళ్లి ఆమెకు బలవంతంగా మద్యం తాగించారు. ఆమె మద్యం మత్తులో ఉండగా ఇద్దరు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం మళ్లీ కారులో ఎక్కించి ఒకరు తర్వాత ఒకరు రేప్ చేశారు. రాత్రి సమయంలో ఆ మహిళను గండిపేట వద్ద వదిలి వెళ్లారు. మత్తులో నుంచి బయటకు వచ్చిన ఆమె వెంటనే భర్తకు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పింది. ఘటనాస్థలికి చేరుకున్న భర్త.. భార్యతో కలిసి నార్సింగి పోలీసు స్టేషన్ వెళ్లాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు