వేద న్యూస్, మరిపెడ:
బీఆర్ఎస్ డోర్నకల్ అభ్యర్థి రెడ్యా నాయక్ గెలుపు కోసం ఆ పార్టీ నేతలు ప్రచారం చేపట్టారు. మరిపెడ మున్సిపాలిటీని10వ వార్డు మాకుల తండాలో విస్తృత ప్రచారం సోమవారం నిర్వహించారు. ఈ ప్రచారంలో బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకల నరేష్ రెడ్డి, మున్సిపాలిటీ చైర్ పర్సన్ సింధూర రవి నాయక్, వైస్ చైర్మన్ ముదిరెడ్డి బుచ్చిరెడ్డి, కుడితి మహేందర్ రెడ్డి , మాజీ సర్పంచ్ రాంలాల్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి రెడ్యా గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
