• బీఆర్ఎస్ అభ్యర్థి మనోహర్ రెడ్డి ధీమా

వేద న్యూస్, ఎలిగేడు:
పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం‌లోని సుల్తానాపూర్, నారాయణ పల్లి, ఎలిగైడ్ గ్రామాల్లో బీఆర్ఎస్ అభ్యర్థి దాసరి మనోహర్ రెడ్డి సోమవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ అమలు చేస్తున్న సంక్షేమ ఫలితాలే మళ్లీ గెలిపిస్తాయని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతాలు చేస్తూ గ్యారెంటీ లేని ఆరు గ్యారెంటీలను ప్రజల ముందుకు తీసుకెళ్తూ మభ్యపెడుతున్నారని దుయ్యబట్టారు. ఇంతకుముందు ఏం చేశారని ఇకముందు ఏం చేస్తారని అడిగారు. మళ్లీ కారు గుర్తుకే ఓటేసి కేసిఆర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.

కార్యక్రమంలో జెడ్పిటిసి మండిగ రేణుక, ఎంపీపీ తానిపర్తి స్రవంతి మోహన్ రావు, మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు బైరెడ్డి రామిరెడ్డి, కే డి సి సి చైర్మన్ భాస్కర్ రెడ్డి, ఖలీల్, సమ్మయ్య, సుధాకర్ రావు, సంజీవరావు, రాజేశం, శ్రీనివాస్ రెడ్డి, తిరుపతి రెడ్డి, మల్లారెడ్డి, లింగారెడ్డి, బత్తిని శ్రీనివాస్, తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కార్యక్రమంలో మహిళలు వేసిన కోలాట కార్యక్రమం అందర్నీ ఆకట్టుకుంది.