వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి:
హనుమకొండ జిల్లా జడ్పీ కార్యాలయంలో జెడ్పీ చైర్మన్ మారపల్లి సుధీర్ బాబు అధ్యక్షత జరిగిన సర్వసభ్య సమావేశంలో వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పాల్గొన్నారు. శనివారం జరిగిన మీటింగ్ లో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు వర్ధన్నపేట నియోజకవర్గ వనరుల గురించి..వివిధ విభాగాల అధికారులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ గజ్జెల శ్రీ రాములు, జడ్పీ సీఈవో వెంకటేశ్వరరావు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీ, జడ్పీ కోఆప్షన్ సభ్యులు ఉస్మాన్ అలీ షేక్ తో పాటు వివిధ విభాగాల ఉన్నత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
