- ఏఎస్ఆర్ సేవా స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు రాజశేఖర్
- నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో సర్జికల్ మాస్కుల పంపిణీ
వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి/నర్సంపేట:
కరోనా వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏఎస్ఆర్ సేవా స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు ఎర్రబోయిన రాజశేఖర్ సూచించారు. శనివారం ఆయన నర్సంపేట పట్టణ ప్రభుత్వ ఆసుపత్రిలో స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సర్జికల్ మాస్క్‌లను పంపిణీ చేశారు. దేశవ్యాప్తంగా మళ్లీ కొవిడ్ మహామ్మారి విజృంభిస్తున్న క్రమంలో జనం జాగ్రత్తగా ఉండాలన్నారు.
ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ కరోనా వైరస్ జేఎన్ -1 వల్ల ప్రాణభయం లేనప్పటికీ వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. మాస్క్ లు ధరించడంతో పాటు శానిటైజర్ తో చేతులను శుభ్రపరచుకోవాలని వివరించారు.
అంతేగాకుండా సామాజిక దూరం పాటించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లే రోగులు తప్పకుండా మాస్క్‌లు ధరించి జాగ్రత్తలు పాటించాలని చెప్పారు.
ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు ఉచితంగా సర్జికల్ మాస్క్‌లను అందజేయాలని జిల్లా వైద్యశాఖ అధికారిని కోరుతున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో స్వయంకృషి స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు బెజ్జంకి ప్రభాకర్, ఏఎస్ఆర్ సంస్థ సభ్యులు రాము సేవక్, వరికెల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.