•  అదనపు డీసీపీ రాగ్యానాయక్
 వేద న్యూస్, వరంగల్ క్రైమ్:
అన్ని ప్రభుత్వ విభాగాలతో పాటు స్వచ్చంధ సంస్థలు సమన్వయంతో పని చేసి వెట్టిచాకిరీ నుండి చిన్నారులను రక్షించి వారి బాల్యాన్ని కాపాడుకుందామని వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌  అదనపు డిసిపి  రాగ్యానాయక్‌ అధికారులకు పిలుపునిచ్చారు. వచ్చే జనవరి  మొదటి తారీఖు నుండి ఆపరేషన్‌ స్మైల్‌ పదవ విడతలో భాగంగా వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా ఆదేశాల మేరకు హన్మకొండ, వరంగల్‌, జనగాం జిల్లాలకు చెందిన చైల్డ్‌ వెల్ఫేర్‌, చైల్డ్‌ ప్రోటక్షన్‌, చైల్డ్‌ లైన్‌ , రెవన్యూ, విద్యా, వైద్యా, లేబర్‌, పరిశ్రమలు , ఏన్‌.జి.ఓ విభాగాలకు అధికారులతో పాటు ఇంచార్జ్‌ పోలీస్‌ అధికారులతో పరిపాలన అదనపు డిసిపి శనివారం పోలీస్‌ కమినషనరేట్‌ ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా అదనపు డిసిపి మాట్లాడుతూ తప్పిపోయిన, వదిలేయబడిన, రోడ్డుపై భిక్షాటన చేస్తున్న, బాల కార్మికులుగా పనిచేస్తున్న  పిల్లలను గుర్తించి వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్‌ ఇచ్చి అప్పగించడం లేదా పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు. ఎక్కడైన బాలకార్మికులను గుర్తిస్తే వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ వాట్సప్‌ నంబర్‌ 100 కు సమాచారాన్ని అందించే విధంగా ప్రజల్లో అవగాహన పెంచాలని, ఇకపై రానున్న రోజుల్లో బాలకార్మికుల నిర్మూలకై ప్రతి నెల ఒక కార్యక్రమాన్ని నిర్వహించబడేందుకుగాను ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అదనపు డిసిపి అధికారులకు సూచించారు.
ముఖ్యంగా ప్రతినెల ఒకోక్క రంగాన్ని ఎంచుకోని ఆయా రంగాల్లో పనిచేసే బాలకార్మికులను గుర్తించి వారిని వెట్టిచాకిరి నుండి విముక్తి కలిగించాలని, ముఖ్యంగా చిన్నారులతో వెట్టిచాకిరి చేయించుకోవడం చట్యరీత్యా నేరమని, ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని అదనపు డిసిపి ప్రజలకు సూచించారు.
కేంద్ర ప్రభుత్వం అధ్వర్యంలో 2015 నుండి 2023 వరకు చెపట్టిన  ఆపరేషన్‌ స్మైల్‌, ముస్కాన్‌ లో  3,273 మంది పిల్లలను రక్షించి వారి తల్లిదండ్రులకు అప్పగించడంతో పాటు 177 జె.జె యాక్ట్‌ క్రింద కేసులను నమోదు చేయగా, మరొ 15 మంది తప్పిపోయిన చిన్నారులను గుర్తించడం జరిగిందని అదనపు డిసిపి తెలియజేసారు. అనంతరం అధికారులందరు చిన్నారులను  వెట్టిచాకిరీ నుండి విముక్తి పై అవగాహన కల్పిస్తూ రూపోందించిన గోడ ప్రతులను అవిష్కరించారు.
ఈ సమావేశంలో  ఏహెచ్‌ఐయూ ఇన్‌ స్పెక్టర్‌ వెంకట్రాం, వరంగల్‌ జిల్లా వైద్యాధికారి  డా. వెంకట్రామణ, మూడు జిల్లాల చైల్డ్‌ వెల్ఫేర్‌ అనిల్‌ చందర్‌, వసుధ, ఉప్పలయ్య,  హనుమకొండ ఉప వైద్యాధికారి డా. మదన్‌ మోహన్‌ ఏహెచ్‌ఐయూ ఎస్‌.ఐలు ఫసీయుద్దీన్‌, మల్లేష్‌,  ఏ.ఎస్‌.ఐ భాగ్యలక్ష్మీ, హెడ్‌కానిస్టేబుల్‌ సమీయుధ్దీన్‌, కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌తో పాటు  చైల్డ్‌ లైన్‌, డబ్యూసిడి, విధ్యా, ఆరోగ్య,  పోలీస్‌ చెందిన అధికారులు సిబ్బంది పాల్గోన్నారు పాల్గొన్నారు.