వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి:
ములుగు రోడ్డులోని లాల్ బహదూర్ కళాశాల ఎన్సిసి ఆర్మీ పదో తెలంగాణ బెటాలియన్ ఆధ్వర్యంలో ఆంగ్ల నూతన సంవత్సరాది 2024కు ఘన స్వాగతం పలికారు. ఆదివారం ఎన్సిసి క్యాడేట్స్ కేక్ కట్ చేసి 2024 సెలబ్రేషన్స్ చేసుకున్నారు.
క్యాడేట్స్ నూతన సంవత్సరానికి ఉల్లాసంగా..ఉత్సాహంగా స్వాగతాన్ని తెలుపుతూ..‘‘ఎన్సిసి అక్షరాలను తెల్లటి రాళ్లచే నిర్మించి( చిన్నచిన్న రాళ్లను సేకరించి)’’ అందరినీ అబ్బుర పరిచారని ప్రిన్సిపాల్ డాక్టర్ అరుణ డిహెచ్ రావు తెలిపారు.
కార్యక్రమంలో ఎన్సిసి అధికారి కెప్టెన్ డాక్టర్ ఎం సదానందం, జూనియర్ అండర్ ఆఫీసర్ రాము, దుర్గాప్రసాద్, రజినీకాంత్, జగదీష్, శివాని తదితరులు పాల్గొన్నారు. ఎన్సిసి లోగో వద్ద రంగురంగుల ఎన్సిసి వరంగల్ గ్రూపునకు వెల్ కమ్ నూతన సంవత్సరానికి స్వాగతిస్తున్న అక్షరాలు చాలా చక్కగా ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. అది చూసిన వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.