వేద న్యూస్, ఎలిగేడు:
పెద్దపెల్లి జిల్లా ఎలిగేడు మండల పరిధిలోని లాలపల్లి గ్రామంలో శ్రీరామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా శోభాయాత్రను వైభవంగా నిర్వహించారు. ఈ యాత్రలో గ్రామస్తులు, రామ భక్తులు ‘‘జై శ్రీరామ్, జై శ్రీరామ్’’ అంటూ నినాదాలు పెద్ద ఎత్తున చేశారు.

దశాబ్దాల కల నెరవేరిందని ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గుర్రం మల్లారెడ్డి, సామ రాజేశ్వర్ రెడ్డి, బద్దం మల్లారెడ్డి, పెద్ది రాజేశం, ఏలేటి మల్లారెడ్డి, గడ్డం శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్ సింగిరెడ్డి ఎల్లవా, నాయకులు శ్రీనివాస్ రెడ్డి, మైపాల్ రెడ్డి, తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.