- పీడీఎస్‌యూ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు అంగిడి కుమార్
వేద న్యూస్, పెద్దపల్లి:
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కిరాయి భవనాల్లో కొనసాగుతున్న కాలేజ్, హాస్టల్స్‌కు సొంతభవనాలు కేటాయించాలని పీడీఎస్‌యూ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు అంగిడి కుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ హాస్టల్ ప్రహరీ గోడలు పెద్దవిగా కట్టాలన్నారు. వందలాది విద్యార్థులు ఉన్న హాస్టల్స్ లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మరుగుదొడ్లను పెంచాలని కోరారు. అన్ని హాస్టళ్లకు సొంత భవనాలు కేటాయించి నాణ్యమైన ఆహారాన్ని అందించాలన్నారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని కోరారు.
పెండింగ్ లో ఉన్న ప్రభుత్వ హాస్టల్స్ బిల్స్ చెల్లించాలని, పెరిగిన హాస్టల్స్ మెస్ చార్జీలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను నెరవేర్చని యెడల ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం హాస్టల్ కమిటీని ఎన్నుకున్నారు.
హాస్టల్ ప్రెసిడెంట్‌గా వెన్నెల, జనరల్ సెక్రెటరీగా దివ్య, వైఎస్ ప్రెసిడెంట్ గా శ్రీలత, జాయింట్ సెక్రటరీగా సంధ్య, కమిటీ సభ్యులుగా శిరీషను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా పీడీఎస్ యూ ఉపాధ్యక్షులు సన్నీ తదితరులు పాల్గొన్నారు.