వేద న్యూస్, హైదరాబాద్/హన్మకొండ:
కాంగ్రెస్ అధిష్టానం పిలుపుమేరకు త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఆశావాహులు దరఖాస్తులు సమర్పిస్తున్నారు.
ఈ నేపథ్యంలో చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం నుండి తనకు అవకాశం కల్పించాలని కోరుతూ హనుమకొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆవేలి దామోదర్ శనివారం దరఖాస్తు సమర్పించారు. 50వేల రూపాయల రుసుము చెల్లించారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం పనిచేసిన తనకు అవకాశం కల్పించాలని కోరారు.