వేద న్యూస్, నెక్కొండ:
నెక్కొండ మండల పరిధిలోని చంద్రుగొండ, గొల్లపల్లి గ్రామాలలో జరుగుతున్న ప్రత్యేక పారిశుధ్య పనుల ప్రణాళికలో భాగంగా శనివారం అధికారిణి..జెడిఎ ఉషా దయాల్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ప్రత్యేకంగా గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుటకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
గ్రామాలలో ప్రభుత్వం నిర్దేశించిన ప్రణాళికల ఆధారంగా రోజువారీగా నిర్ణీత నమూనాలో రిపోర్టు అందించాలని పంచాయతీ కార్యదర్శులకు సూచించారు, కార్యక్రమంలో చంద్రుగొండ, గొల్లపల్లి గ్రామాల స్పెషల్ ఆఫీసర్ ఏవో నాగరాజు, పంచాయతీ కార్యదర్శి సుమన్, ఎండి పాషా, గ్రామపంచాయతీ పారిశుధ్య సిబ్బంది పాల్గొన్నారు.