వేద న్యూస్, వరంగల్ క్రైమ్ :
వరంగల్ పోలీసులు తమ మానవత్వాన్ని చాటుకున్నారు. వరంగల్ మట్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒంటరిగా తిరుగుతున్న ఓ వృద్ధురాలిని బ్లూ కొల్ట్స్ కానిస్టేబుల్ నాంపల్లి విజేందర్ చేరదీసి తన మానవత్వాన్ని చాటుకున్నారు. భూపాల్ పల్లి రేగొండ మండలం పొనుగోండ్ల గ్రామానికి చెందిన గంపల లచ్చమ్మ అనే వృద్దురాలు ఒంటరిగా తిరగడం గమనించిన కానిస్టేబుల్ నాంపల్లి విజేందర్ ఆమె గురించి తెలుసుకొనే ప్రయత్నం చేశారు.
వృద్దురాలు తప్పిపోయిందనీ గుర్తించిన కానిస్టేబుల్ ఆమెకు భోజనం ఏర్పాటు చేసి స్థానిక సఖి సెంటర్ లో ఆశ్రయం కల్పించి వృద్ధురాలి బంధువులకు సమాచారం అందించారు.కాగా శనివారం కుటుంబ సభ్యులకు మట్వాడ పోలీసులు వృద్దురాలిని అప్పగించారు. దారి తప్పి నగరానికి చేరిన వృద్దురాలిని చెరదీసి బందువులకు అప్పగించడంలో చొరవ చూపిన కానిస్టేబుల్ నాంపల్లి విజేందర్ ను వరంగల్ ఏసీపీ బోనాల కిషన్ సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమంలో మట్వావాడ, ఇంతేజార్ గంజ్, మిల్స్ కాలనీ ఇన్స్ స్పెక్టర్లు గోపి, పవన్ కుమార్, మల్లయ్య , కానిస్టేబుల్స్ పాల్గొన్నారు.