• మరిపెడ 9వ వార్డు కౌన్సిలర్ విసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి

వేద న్యూస్, మరిపెడ:
సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ పునః నిర్మాణం లో భాగస్వామ్యం అయ్యేందుకు ప్రజా అభీష్టం,  కార్యకర్తల నిర్ణయం మేరకు తాను బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు మరిపెడ మున్సిపల్ 9వ వార్డు కౌన్సిలర్ విసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి తెలిపారు.

గురువారం పురపాలిక కేంద్రంలో ఆమె మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న 6గ్యారెంటీ లు ప్రజా రంజకం గా ఉన్నట్టు చెప్పారు. రానున్న రోజుల్లో అభివృద్ది లో భాగస్వామ్యం కావడం లక్ష్యం గా పని చేస్తామని వెల్లడించారు. సమావేశంలో శాలి వాహన సంఘము మండల అధ్యక్షుడు అల్వల ఉపేందర్, దుగుంట వెంకన్న, దేవరశెట్టి లక్ష్మీ నారాయణ తదతరులు పాల్గొన్నారు.