– విశ్రాంత అటవీ అధికారి పురుషోత్తం, పర్యావరణ వేత్త పిట్టల రవిబాబు
– వరంగల్, హనుమకొండ మిద్దెతోట సాగుదారుల సమావేశం
వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి:
ములుగు రోడ్డు అక్షర కాలనీలోని ప్రభాకర్ రావు ఇంట్లో వరంగల్, హనుమకొండ మిద్దె తోట సాగు దారుల సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా విశ్రాంత జిల్లా అటవీ అధికారి కాజీపేట పురుషోత్తం, పర్యావరణ ఉద్యమకారులు, ప్రముఖ పర్యావరణవేత్త పిట్టల రవి బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు పలు సూచనలు చేశారు. తప్పనిసరిగా ఆర్గానిక్ పద్ధతిలోనే కూరగాయలు ఇంటి ఆవరణంలో గానీ, పెరటిలో గాని, మేడపైన గాని, మిద్దపైన గాని ఇంటివద్దనే సాగు చేసుకోవాలన్నారు.
స్థానిక వంగడాలను మాత్రమే ఉపయోగించాలి
కూరగాయలను, ఆకుకూరలను, దుంపలను, గడ్డలను, పువ్వులను సేద్యం చేసుకుని ఆరోగ్యంతమైన జీవితాన్ని గడపొచ్చని తెలిపారు. హైబ్రిడ్ వంగడాలు మనిషి ఆరోగ్యానికి హానికరం అని చెప్పారు. స్థానిక వంగడాలను మాత్రమే ఉపయోగించుకుంటూ హైబ్రిడ్ రకాలను దూరం చేసుకోవాలని సూచించారు. ఎవరి ఇంట్లో వారి తమకు సరిపడా కూరగాయలు, పండ్లు పండించుకోవాలి అని సూచించారు. దానివల్ల శారీరక ఆరోగ్యము, మానసిక ఉల్లాసము కలిగి సంతోషంగా ఉండొచ్చని స్పష్టం చేశారు. అలాగే ఇలాంటి అసోసియేషన్‌లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. మిద్దె తోట దారులతో మాత్రమే కాక ఇంటి పెరడులో పెంచుకునే వారిని కూడా ఈ సంస్థలో చేర్చుకుంటే మరింత విరివిగా ప్రజలకు అవగాహన కలుగుతుందని పురుషోత్తం సూచించారు.
రకరకాల సంస్థలు, గ్రూప్‌లు ఎన్నో ఏర్పాటు అవుతున్నా..ముఖ్యంగా నగరాల్లో పచ్చదనం కరువు అవుతున్న ప్రస్తుత స్థితుల్లో మంచి పరిష్కారం ‘మిద్దె తోటలు, పెరటి తోటలు’ మాత్రమే అని ఈ విషయంలో కృషి చేస్తున్న హనుమకొండ మిద్దె తోట మిత్రులను అభినందించారు. ప్రగళ్లపాటి రాజ్ కుమార్ మాట్లాడుతూ ఒక కుటుంబ సభ్యుల లాగా మిద్దేతోట సభ్యులంతా తరచూ కలుసుకొని ముందు ముందు మరింత పెద్ద కార్యక్రమాలు చేయాలనే ఆశయంతో ప్రతీ నెలా సమావేశాలు జరుపుతున్నామని చెప్పారు. పెద్దలు, అతిథులు సూచించిన సలహాలు కూడా సభ్యులంతా కలిసి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అనంతరం ప్రభాకర్ మిద్దె తోట సందర్శించిన పిదప ప్రభాకర రావు దంపతుల ఆతిథ్యం స్వీకరించిన అనంతరం అధ్యక్షుల గౌరవ వందనంతో సమావేశం ముగిసింది.
Veda News is doing a great role news digital news, 😄 are supporting and bringing the real news and articles. Thank you Veda News…..
One of the reader of Veda News.
Ravi Babu Pittala, Environmentalist JNTUH Hyderabad.
Thank You Sir