- ఎఫ్ఏసీగా బాధ్యతల స్వీకరణ
వేద న్యూస్, జమ్మికుంట:
జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్‌గా డాక్టర్ బి. రమేష్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఇటీవల జరిగిన బదిలీల్లో భాగంగా హన్మకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ రసాయనశాస్త్ర అసోసియేట్ ప్రొఫెసర్ బి.రమేష్ జమ్మికుంటకు ట్రాన్స్ఫర్ అయ్యారు. ఆయన్ను కాలేజీ విద్యా శాఖ కమిషనరేట్ ఆఫీసు జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ (ఎఫ్ఏసీ)గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
రమేష్ కళాశాల పూర్తి అదనపు బాధ్యతల ప్రిన్సిపాల్‌గా విధులలో చేరారు. ఈ సందర్భంగా కళాశాల అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది నూతన ప్రిన్సిపాల్‌కు పుష్పగుచ్ఛం అందించి..శాలువాతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో అధ్యాపకులు డాక్టర్ కె. రాజేంద్రం, డాక్టర్ ఎస్. ఓదేలు కుమార్, డాక్టర్ క్యామల, డాక్టర్ మాధవి, డాక్టక్ ఉమాకిరణ్, డాక్టర్ గణేశ్, డాక్టర్ రవి, పి.శ్రీనివాస్‌రెడ్డి, ఎల్. రవీందర్, డాక్టర్ సుష్మ, డాక్టర్ రవిప్రకాష్, ప్రశాంత్, రమేష్, అరుణ్ రాజ్, సాయి, అనూష తదితరులు పాల్గొన్నారు.