వేద న్యూస్, వరంగల్: 
 భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు జన్మదినం సందర్భంగా ఆయనకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు వెల్లువలా శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం నియోజకవర్గవ్యాప్తంగా గండ్ర బర్త్ డే వేడుకలు కాంగ్రెస్ శ్రేణులతో పాటు అభిమాన సంఘాలు ఘనంగా నిర్వహించాయి. 

శాయంపేట మండలకేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులు కేకులు కట్ చేసి పెద్ద ఎత్తున జన్మదిన వేడుకలు నిర్వహించాయి. ఎమ్మెల్యే సత్యనారాయణను విలేకరి వుస్నగిరి శ్రీకాంత్ మర్యాదపూర్వంగా కలిసి పుష్పగుచ్ఛమిచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నియోజవర్గ ప్రజలకు సేవ చేస్తూ.. భవిష్యత్తులో మరింత ఉన్నతస్థానానికి ఎమ్మెల్యే వెళ్లాలని ఆకాంక్షిస్తున్నట్టు వెల్లడించారు.