- ఘనంగా గులాబీ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడి బర్త్ డే
వేద న్యూస్, ఓరుగల్లు:
వరంగల్ పశ్చిమ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు వినయ్ భాస్కర్ ను శుక్రవారం కేటీఆర్ సేన వరంగల్ జిల్లా అధ్యక్షుడు మైనాల నరేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. వినయ్ భాస్కర్ జన్మదినం సందర్భంగా ఆయన కు పూల మొక్క అందజేశారు. ఈ సందర్భంగా యువనేత నరేష్ వినయ్ భాస్కర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా నరేశ్ మాట్లాడుతూ.. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధికి తనవంతుగా కీలక పాత్ర పోషించిన లీడర్, ఉద్యమకారుడు వినయ్ భాస్కర్ అని కొనియాడారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో వినయ్ భాస్కర్ ఓరుగల్లు గడ్డపైన క్రియాశీలక పోరాటాలు చేశారని వెల్లడించారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో వినయ్ భాస్కర్ గులాబీ జెండాను ఎగురవేశారని తెలిపారు. కేసీఆర్ నాయకత్వమే తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామరక్ష అని వెల్లడించారు.