• ఓయూ నేత పాలడుగు శ్రీనివాస్

విద్య , మహిళల బలోపేతానికి మహాత్మా జ్యోతిబాపూలే చేసిన కృషి అపూర్వమని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నేత పాలడుగు శ్రీనివాస్, బీసీ సంఘం నేత మేకపోతుల నరేందర్ గౌడ్, అన్నారు. మహాత్మా జ్యోతిబాపూలే 199 వ జయంతిని పురస్కరించుకొని జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం హైదర‌గూడ ఓల్డ్ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద కొత్తగా ఏర్పాటు చేసిన మహాత్మ జ్యోతిబాపూలే దంపతుల విగ్రహావిష్కరణలో పాల్గొని మాట్లాడారు.

జ్యోతిబాపూలే సాధించిన ఘనత దేశానికి మార్గదర్శకమైందని , చదువు కోసం ,మహిళల సాధికారత కోసం ఆయన చేసిన కృషి అపూర్వమన్నారు. సామాజిక ఉద్యమకారునిగా, కుల వివక్షతకు వ్యతిరేకంగా ,అన్ని వర్గాల సమానత్వానికి కృషి చేసిన మహాత్మ జ్యోతిబాపూలే సేవలు నేటి సమాజం ఆచరిస్తున్నదన్నారు. జ్యోతిబాపూలే చేసిన సేవలను నేటి విద్యార్థులకు, చిన్న పిల్లలకు అధికారులు, సామాజికవేత్తలు అవగాహన కల్పించేందుకు కృషి చేయాలన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం కుల ,మత, వర్గ భేదాలు లేకుండా అందరూ కలిసి చదువుకునేలా ఒక్కొటి 200 కోట్ల రూపాయలతో “యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలలను” రాష్ట్రవ్యాప్తంగా స్థాపిస్తున్నదని, ఇందులో భాగంగానే నల్గొండ జిల్లాలో 6 పాఠశాలలు మంజూరయ్యాయని, ఇందులో ఎస్సీ, ఎస్టీ ,బీసీ, మైనార్టీ అన్ని వర్గాల పిల్లలు ఉంటారన్నారు.

మూడో విడత దేవరకొండకు కుడా యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాల మంజూరయ్యిందని తెలిపారు.కష్టపడి చదవటం తప్పా, చదువుకు దగ్గరి దారులు లేవని, ఆందువల్ల విద్యార్థులు బాగా చదవాలని, ప్రతి ఒక్కరు జ్యోతిబాపూలేని ఆదర్శంగా తీసుకొని బాగుపడాలని పిలుపునిచ్చారు.