వేద న్యూస్, వరంగల్ :

ప్రజావాణి అర్జీలు సకాలంలో పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ పి. ప్రావీణ్య ఆదేశించారు. వరంగల్ జిల్లా కలెక్టర్ సమావేశ హాల్లో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చే సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు.

ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేయాలంటే అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని, ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి ప్రభుత్వ పథకాలకు కావలసిన అర్హతలను బట్టి వారికి మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సోమవారం జరిగిన ప్రజావాణిలో మొత్తం 53 దరఖాస్తులు స్వీకరించారు.