- డాక్టరేట్ అందుకున్న పూర్వ విద్యార్థి అరుణ్ ను అభినందించిన మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్ లర్
వేద న్యూస్, వరంగల్:
మహాత్మాగాంధీ యూనివర్సిటీ నల్లగొండలో ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఎంఎస్సీ చదివిన అరుణ్ కుమార్..అనంతరం ఆలిండియా లెవల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ‘గేట్’లో ఉత్తీర్ణత సాధించి వరంగల్ జాతీయ సాంకేతిక సంస్థ (నిట్)లో పీహెచ్‌డీలో జాయిన్ అయ్యారు. ఇటీవల అరుణ్‌కు నిట్‌లో డాక్టరేట్ ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా అరుణ్ కుమార్ ను శనివారం మహాత్మా గాంధీ యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్, అధ్యాపకులు ఘనంగా సన్మానించారు. తన ప్రతిభతో ప్రతిష్టాత్మక వరంగల్ జాతీయ సాంకేతిక సంస్థలో డాక్టరేట్ అందుకున్న అరుణ్ కుమార్ వర్సిటీ విద్యార్థులు సిబ్బంది అభినందించారు.
మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలో విద్యార్థి సంఘం నేతగా సమస్యలపై అరుణ్ కుమార్ తన గళాన్ని వినిపించారు. కష్టాల కడలిని దాటి అంచెలంచెలుగా ఎదుగుతూ ఉన్నత చదువుల్లో రాణించి ప్రయోజకుడై తాజాగా డాక్టరేట్ పట్టాను అందుకోవడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అరుణ్ కుమార్ భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి వెళ్లాలని మహాత్మా గాంధీ వర్సిటీ వీసీ, ప్రొఫెసర్లు ఆకాంక్షించారు.
దోనిపాములవాసికి డాక్టరేట్.. ఊరి పేరు నిలబెట్టిన రాచమల్ల అరుణ్