వేద న్యూస్, కరీంనగర్:
కరీంనగర్ జిల్లాకేంద్రంలోని భగత్ నగర్ లో టీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కరీంనగర్ ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవానికి హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని జర్నలిస్టులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు.
శనివారం జరిగిన ప్రెస్ క్లబ్ ఓపెనింగ్ కు కరీంనగర్ నగర మేయర్ సునీల్ రావు, కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ చార్జి శ్రీనివాస్ పురిమల్ల, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నాకు నాయకుడు అంబటి జోగి రెడ్డి, సీ పీఐ నగర కార్యదర్శి సురేందర్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి జోగిరెడ్డి, సిపిఎం కరీంనగర్ జిల్లా కార్యదర్శి మిల్కురి వాసుదేవరెడ్డి, టీడబ్ల్యూజేఎఫ్ జాతీయ నాయకుడు ఆనందం, ఆ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు సోమయ్య, బసవ పున్నయ్య లు హాజరయ్యారు. ఫెడరేషన్ హుజూరాబాద్ డివిజన్ అధ్యక్షుడు యోహాన్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు భానుచందర్, రవికృష్ణ, రఫీక్, రాజు, సంతోష్, ఖాజా ఖాన్, శ్రీనివాస్, శ్రీరాములు, నవీన్, శ్రీకాంత్, రాజేంద్రప్రసాద్, రామరాజు, ఎల్లస్వామి తదితరులు పాల్గొన్నారు.