Oplus_131072

వేద న్యూస్, కోదాడ టౌన్ :

సూర్యాపేట జిల్లా కోదాడ తేజ విద్యాలయంలో లో 6 నుంచి 10వ తరగతి వరకు చదువు పూర్తి చేసిన తిప్పన అభిరామ్ రెడ్డి ఇంటర్ వరంగల్ ఏస్ఆర్ కాలేజ్ లో చదువుకున్నాడు. శనివారం ప్రకటించిన ఐఐటీ, జెఈఈ 2025 మెయిన్స్ పరీక్ష ఫలితాల్లో మంచి ప్రతిభ కనబరిచి ( HT.No. 25031045956) 99.48 పర్సంటైల్ తో ఆల్ ఇండియా ర్యాంక్ 969 సాధించాడు.అభిరామ్ తన లక్ష్యం సివిల్ సర్వీసెస్ సాధించడమని చెప్పాడు.తేజ విద్యాలయంలో 10వ తరగతి చదువుతున్నప్పుడు న్యూఢిల్లీలో జరిగిన జాతీయ స్థాయిలో ఇంటాక్ హెరిటేజ్ క్విజ్ విజేతగా నిలిచాడు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ రమాసోమిరెడ్డి అభిరామ్ రెడ్డి కి అభినందనలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *