• ‘పనిష్‌మెంట్ వర్సెస్ రిహాబిలిటేషన్’పై డిస్కషన్‌లో స్టూడెంట్స్ 
  • జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో పై అంశంపై డిబేట్

వేద న్యూస్, జమ్మికుంట:

తప్పటడుగులు వేసే యువతను శిక్షించడము కంటే వారికి పునరావాసము కల్పించడం ముఖ్యమని విద్యార్థులు అభిప్రాయం వ్యక్తం చేశారు. జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ, పీజి కళాశాలలో బుధవారం కళాశాల యాంటీ డ్రగ్స్ కమిటీ ఆధ్వర్యంలో ప్రిన్సిపాల్ డా. బి.రమేష్ అధ్యక్షతన విద్యార్థులకు పనిష్మెంట్ (శిక్ష) వర్సెస్ రీహబిలిటేషన్ (పునరావాసం) అనే అంశం పై డిబెట్ (చర్చ) కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు రెండు బృందాలుగా ఏర్పడి ఉత్సహంగా చర్చను చేపట్టారు.

డ్రగ్స్ సరఫరా చేసేవారిని, డ్రగ్స్ కు బానిసలైనవారిని శిక్షించాలని, డ్రగ్స్ మత్తులో యవత అనేక నేరాలకు పాల్పడుతున్నారని, వారిని చట్ట ప్రకారంగా శిక్షించాలని ఒక వర్గం అభిప్రాయం వ్యక్తం చేయగా, రెండో వర్గం విద్యార్థులు స్నేహితుల వల్లనో, ఇతరుల వల్లనో క్షణికావేశానికీ గురై డ్రగ్స్ కు బానిసలైనా యువకులను శిక్షించడం వల్ల వారి భవిష్యత్తు దెబ్బతింటుందని వారికి పునరావసం కల్పించి కొత్త జీవితాన్ని కల్పించడమే ఉత్తమమని అభిప్రాయపడ్డారు.

కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డా.బి. రమేష్, యాంటీ డ్రగ్స్ కమిటీ కో-ఆర్డినేటర్ సి. రాజకుమార్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు డా. రవి, ఎల్. రవిందర్, కిరణ్ కుమార్, సాయి కుమార్, అధ్యాపకులు, విద్యార్థులు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *