వేద న్యూస్, కొత్తకొండ/ఎల్కతుర్తి:
కొత్తకొండ వీరభద్రస్వామి హుండీ ఆదాయాన్ని గురువారం లెక్కించారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ గ్రామంలో ఈ నెల 1 నుంచి 25 వరకు వీరభద్రస్వామి వారికి భక్తులు కానుకల రూపేనా వచ్చిన హుండీలను ఓపెన్ చేసి లెక్కించారు.

ఈ కార్యక్రమంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ హనుమకొండ జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ రామాల సునీత, డివిజనల్ ఇన్ స్పెక్టర్ దేవాదాయ ధర్మాదాయ శాఖ వరంగల్ నుండి సంజీవరెడ్డి.. పర్యవేక్షణలో వీరభద్ర స్వామి దేవస్థానం కార్యనిర్వాణాధికారి పి.కిషన్ రావు అనుసంధానముతో..ముల్కనూర్ పీఎస్ నుండి సబ్ ఇన్ స్పెక్టర్ సాయిబాబా ఆధ్వర్యంలో హెడ్ కానిస్టేబుల్ కానిస్టేబుల్, హోంగార్డులు పాల్గొన్నారు.

వీరభద్ర స్వామి దేవస్థానం ఉప ప్రధానార్చక కంచన పెళ్లి రాజయ్య, ముఖ్య అర్చకులు మొగిలిపాలెం రాంబాబు, అర్చకులు తాటికొండ వీర భద్రయ్య, గుడ్ల శ్రీకాంత్, తాటికొండ రమేష్, మొగిలిపాలెం శివకుమార్, శరత్ చంద్ర, గురు ప్రసాద్, దేవస్థానము సిబ్బంది ఆర్కే రామకృష్ణ, జూనియర్ అసిస్టెంట్ సంజీవరావు, జూనియర్ అసిస్టెంట్ వి మల్లారెడ్డి, డిప్యూటేషన్ స్పెషల్ సిబ్బంది, జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ కొండూరి రవీందర్, రికార్డ్ అసిస్టెంట్ శ్రీధర్, మాడిశెట్టి అటెండర్ ఎర్రోజు రాజు, నైట్ వాచ్ మెన్ జంపాల రాజేందర్, స్వీపర్ ఎస్ యాదమ్మ, ఎండి చాంద్ బి, కళ్యాణి జాతర ప్రత్యేక స్వీపర్ సిబ్బంది మంజుల రాజేశ్వరి, తోటమాలి బిక్షపతి డిప్యూటేషన్ పై వచ్చిన ఎర్రగట్టుగుట్ట రికార్డ్ అసిస్టెంట్ శ్రీనివాస్, రేణుక ఎల్లమ్మ జూనియర్ అసిస్టెంట్ నీల కుమార్, రేణుక ఎల్లమ్మ అటెండర్ హుండీల ప్రత్యేక కౌంటింగ్ లో పాల్గొన్నారు.

హుండీల లెక్కించుటకు వరంగల్ నుండి మహిళలు, ఎల్కతుర్తి మండల్ హెడ్ క్వార్టర్ నుండి స్వచ్ఛంద సేవ సంస్థ మహిళలు, కొత్తకొండ సరస్వతి సేవా సమితి మహిళలు వచ్చారు. కొత్తకొండ యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ లక్ష్మీనారాయణ నలుగురు సిబ్బందితో కలిసి కలిసి వారు కౌంటింగ్ కు వచ్చారు.

 

దేవాదాయ ధర్మాదాయ శాఖ కొత్తకొండ దేవాలయానికి భక్తుల ద్వారా హుండీల ద్వారా వచ్చిన ఆదాయం 27 లక్షల ఇరవై ఒక వెయ్యి 945 రూపాయలు అని తెలిపారు. రెండు కిలోల 730 గ్రాముల వెండి మిశ్రమం, ఒక గ్రాము మిశ్రమ బంగారం వచ్చిందని, 11 అమెరికా డాలర్స్ నోట్లు వచ్చాయని పేర్కొన్నారు. ఈ ఆదాయ వివరాలు దేవాలయ కార్యాలయంలో రికార్డుగా భద్రపరిచినట్లు ఈవో తెలిపారు. ఈ మేరకు ఈవో ఒక ప్రకటన విడుదల చేశారు.