•  మాజీ ఎమ్మెల్సీ, ఎంపీ కడియం కావ్య పూర్తి బాధ్యత వహించాలి
  • కాసం ఓం నమశివాయను వెంటనే అరెస్టు చేయాలి
  •  ఆజంజాహి కార్మికుల డిమాండ్

వేద న్యూస్, వరంగల్ :

వరంగల్ నగరంలోని ఆజంజాహి కార్మికుల భవనం కూలగొట్టి అందులో కార్మికులకు సంబంధించిన విలువైన పత్రాలు, బీరువాలు, కుర్చీలు, దర్వాజాలను కాసం ఓం నమశివాయ ఎత్తుకుపోయారని కార్మికులు ఆరోపించారు. సోమవారం అజంజాహి కార్మికుల యూనియన్ కార్యాలయ స్థలంలో సుమారు వందమంది కార్మికులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి సమావేశం ఏర్పాటు చేసుకున్నారు.

ఈ కార్యక్రమంలో వాలంటరీ రిటైర్డ్ కార్మికుల అధ్యక్ష , కార్యదర్శులు శ్రీనివాస్,కృష్ణ మాట్లాడుతూ కార్మికుల భవనాన్ని కూల్చి వారి ఆస్తిని ఎత్తుకు వెళ్ళిన కాసం ఓం నమశివాయను, అతనికి సహకరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. దీనిని వెంటనే పరిశీలించి కార్మికుల కార్యాలయ భవనాన్ని భూమిని కాపాడాలని కోరామన్నారు.

అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు, వరంగల్ ఎంపీ కడియం కావ్య పూర్తి బాధ్యత వహించి భవన నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కారం అయ్యేంతవరకు పోరాట రూపాన్ని చేపడతామని అలాగే ఓం నమశివాయపై చట్టపరమైన చర్యలు చేపట్టి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పదివేల మంది కార్మికుల కోపానికి గురికావాల్సి వస్తుందని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు.