- రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఆసుపత్రి
- హాస్పిటల్ పై చర్యలకు వెనకాడుతున్న అధికారులు
వేద న్యూస్, ఓరుగల్లు:
హనుమకొండలోని బంధన్ ఆసుపత్రి కి రాజకీయ నాయకుల అండదండలు ఉన్నాయని, అందుకే ఆసుపత్రిలో తప్పులు జరిగినా చర్యలకు అధికారులు వెనకాడుతున్నారని బాధితుడు కృష్ణ ఆరోపించారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
బంధన్ ఆస్పత్రిలో తనకు జరిగిన అన్యాయంపై వైద్య ఆరోగ్యశాఖ జిల్లా అధికారికి ఫిర్యాదు చేశానని, కంప్లయింట్ చేసి రోజులు గడుస్తున్నా చర్యలకు అధికారులు పూనుకోవడం లేదని విమర్శించారు.
పోస్ట్ ఆఫ్ కేర్ లో వైద్యుల నిర్లక్ష్యం వల్ల తాను ప్రాణాపాయ స్థితికి చేరుకొని నెలలపాటు మంచానికే పరిమితమయ్యానని వివరించారు. జర్నలిస్టుగా తనకు జరిగిన అన్యాయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ చర్యలు తీసుకోకపోవడం పట్ల బాధితుడు కృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి బంధన్ ఆసుపత్రిలో జరిగిన తప్పిదానికి వైద్యులను బాధ్యులను చేస్తూ.. తనకు న్యాయం చేయాలని కోరారు.