వేదన్యూస్ – ఢిల్లీ
బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ స్టార్ హీరో .. కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఒక జింకను వేటాడారనే కారణంతో అతడ్కి ఐదేండ్లు జైలు శిక్ష వేశారు. మరి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో వందల నెమళ్ళు.. జింకల ప్రాణాలు పోవడానికి.. వేటడానికి కారణమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎన్ని ఏండ్లు జైలు శిక్ష పడాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజ్ శ్రవణ్ అన్నారు.
హెచ్ సీయూ విద్యార్థులతో కల్సి ఎమ్మెల్సీ దాసోజ్ శ్రవణ్ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను కలిశారు. ఈసందర్భంగా యూనివర్సిటీకి సంబంధించిన నాలుగోందల భూములను ప్రవేట్ వ్యక్తులకు కట్టబెడుతున్నారు. అటవీ భూములను.. వన్య ప్రాణులను సంహరిస్తున్నారని పిర్యాదు చేశారు.
ఈ క్రమంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ యూనివర్సిటీ భూములను కాపాడుతాము. విద్యార్థుల హక్కులను పరిరక్షిస్తామని హామీచ్చారు. అనంతరం దాసోజ్ శ్రవణ్ మీడియాతో మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం అటవీ ప్రభుత్వ భూములను నాశనం చేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ కోసం యూనివర్సిటీని ధ్వంసం చేస్తున్నారు అని ఆరోపించారు.