ఉగాది పండుగ రోజు నుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన ప్రతి పేదవాడికి రేషన్ కార్డుల ద్వారా సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు.. మంత్రులు ఆ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు.
ఈ క్రమంలో శనివారం మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ” తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సన్నబియ్యం పంపిణీ అనేది పథకం కాదు. పేదవాడికి వరం అని వ్యాఖ్యానించారు. మంత్రి వెంకటరెడ్డి ఇంకా మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న అర్హులైన మూడు కోట్ల మందికి ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తుంది. తమ ప్రభుత్వానికి ఈ ఐదేండ్లు ఏమి ఢోకా లేదు.
రాబోయే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఆ ఐదేండ్లు ఇందిరమ్మ రాజ్యమే ఉంటుంది. పేదవాడికి తిండి గుడ్డ గూడు ఇవ్వాలనే కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సూత్రం. అందులో భాగంగానే సన్నబియ్యం పంపిణీ.. ఇందిరమ్మ ఇండ్లు పథకాలను అమలు చేస్తున్నాము. పదేండ్లు బీఆర్ఎస్ అధికారంలో ఉన్న కానీ కేసీఆర్ కుటుంబమే బాగుపడటమే తప్పా తెలంగాణ ప్రజల్లో ఎవరూ బాగుపడలేదు అని ఆయన అన్నారు.