Former Minister Kakanani Govardhan Reddy

వేదన్యూస్ – అమరావతి

ఏపీ ప్రధాన ప్రతిపక్ష వైసీపీకి చెందిన సీనియర్ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి హైకోర్టు షాకిచ్చింది. రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా పొదలకూరులో క్వార్ట్జ్ అక్రమ తవ్వకాలపై పోలీసులు మాజీ మంత్రి కాకాణిపై కేసు నమోదు చేసిన సంగతి తెల్సిందే.

ఈ కేసులో ఇప్పటికే మాజీ మంత్రి కాకాణీ గోవర్ధన్ రెడ్డికి రెండు మూడు సార్లు నోటీసులు కూడా జారీ చేశారు. అయితే క్వార్ట్జ్ అక్రమ తవ్వకాల కేసులో అరెస్ట్ నుండి తనని తప్పించాలని హైకోర్టులో మాజీ మంత్రి కాకాణి క్వాష్ పిటిషన్ వేశారు.

ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు ఆపిటిషన్ ను డిస్మిస్ చేసింది. దీంతో రేపో మాపో కాకాణిని పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది.