- బదిలీ అయిన వారికి..
వేద న్యూస్, మరిపెడ:
మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని సీతారాంపురం పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు రామచంద్రు ఆధ్వర్యంలో పాఠశాల నుంచి బదిలీ, ఉద్యోగోన్నతిపై వెళ్తోన్న ఉపాధ్యాయులకు గురువారం ఘన సన్మానం చేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థినీ విద్యార్థులు ఉపాధ్యాయులను ఆదర్శంగా తీసుకొని వారి బాటలో నడిచి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరారు.
అలాగే బదిలీ అయిన ఉపాధ్యాయుల సేవలను కొనియాడారు. ఈ పాఠశాలలో పనిచేసిన సీతారాంపురం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు డీఎస్సీఎన్ మాధురి, ఇదే పాఠశాలలో పనిచేసిన తేళ్ల శ్రీనివాస్ పదోన్నతి పై ప్రధానోపాధ్యాయులుగా వెళ్లడం, అలాగే ఫిరోజ్ ఖాన్, నగేష్ భూక్యా, శౌరి, నిర్మల బదిలీపై వెళ్తున్నట్లు తెలిపారు.
అలాగే ఈ పాఠశాలకు వేరువేరు పాఠశాలల నుండి బదిలీపై వచ్చిన వారు ప్రధానోపాధ్యాయులు రామచంద్రు, ఇతర ఉపాధ్యాయులు సునీల్ కుమార్, అనురాధ, కేదారికు ఆత్మీయ ఆహ్వానం పలికారు. బదిలీపై వెళ్తోన్న ఉపాధ్యాయులు మాట్లాడుతూ ఈ పాఠశాలలో పనిచేసినప్పుడు పాఠశాల గొప్పతనం తెలియలేదని, కానీ, వేరే పాఠశాలలకు వెళ్లిన తర్వాత ఈ పాఠశాల గొప్పతనం తెలిసిందని చెప్పారు.
ఇక్కడ పనిచేసినప్పుడు పాఠశాల తోటి ఉపాధ్యాయుల సహకారం మరువలేనిదని వెల్లడించారు. విద్యార్థినీ విద్యార్థుల క్రమశిక్షణ, ప్రతిభా పాటవాలు ఎంతో గొప్పగా ఉన్నాయని పేర్కొన్నారు. వారి ప్రసంగాలలో పాఠశాలతో ఉన్న అనుబంధాన్ని ఉపాధ్యాయులు నెమరు వేసుకున్నారు.
కార్యక్రమంలో స్టాఫ్ సెక్రటరీ శ్రీశైలం, ఉపాధ్యాయులు సునీల్ కుమార్, విజయలక్ష్మి రామ్మోహన్, వెంకటేశ్వరరావు, వెంకటేశ్వర్లు, ఇందిరా, కేదారి, మేరిశీల, శంకర్, ప్రేమ్ సాగర్, మధుకర్, వెంకన్న, సురేష్, సఫియా బేగం, హరినాథ్ బాబు, భద్ర, ఎస్ఎంసి చైర్మన్ రమేష్ విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.