• బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు ఆవిడపు ప్రణయ్ కుమార్

వేద న్యూస్, హైదరాబాద్:

 పట్టభద్రులు తమ ఓటును నమోదు చేసుకోవాలని బీసీ యువజన సంఘం కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆవిడపు ప్రణయ్ కుమార్ అన్నారు. రానున్న పట్టభద్రుల ఎన్నికల్లో పోటీ చేయనున్న ఆల్ ఫోర్స్ సంస్థల అధినేత నరేందర్ రెడ్డి మద్దతుగా బీసీ యువజన సంఘం ఆధ్వర్యంలో వాంకిడి మండలం ఆశ్రమ పాఠశాలలో ఉచిత ఎన్రోల్మెంట్ కార్యక్రమాన్ని చేపట్టారు.

ఈ సందర్భంగా ఆవిడపు ప్రణయ్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్న పట్టభద్రుడు పూర్తిస్థాయిలో ఓటర్ నమోదు చేసుకోవాలని రానున్న ఎన్నికల్లో నిరుద్యోగులకు అండగా ఉంటూ ఉద్యోగుల సమస్యల పట్ల పోరాటం చేసే ఉత్తమ నాయకున్ని ఎన్నుకోవాలని సూచించారు.

ఓటర్ నమోదు కోసం ఫోన్ నెంబర్ 9440070884,9010785499ను సంప్రదించాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు బొట్టుపల్లి సాయి కృష్ణ , పాఠశాల హెడ్మాస్టర్ శ్రీనివాస్ ఉపాధ్యాయులు మాడుగుల నారాయణమూర్తి మడావి రమేష్ తదితరులున్నారు.