- విద్యార్థిని అనారోగ్యానికి చికిత్సకు సామాజికవేత్త కృషి
- సీఎంఆర్ఎఫ్ కింద రూ.2.5 లక్షల ఎల్‌వోసీ అందజేత
వేద న్యూస్, కరీంనగర్:
ప్రముఖ సామాజికవేత్త, మల్టీ నేషనల్ కంపెనీ జెన్‌ప్యాక్ట్ గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్ సబ్బని వెంకట్ నిరుపేద కుటుంబాన్ని ఆదుకున్నారు. వివరాల్లోకెళితే.. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం రామకృష్ణాపూర్ గ్రామానికి చెందిన ఏ.మానస అనారోగ్యంతో బాధపడుతున్నారు. విషయం తెలుసుకున్న సబ్బని వెంకట్.. ముఖ్యమంత్రి సహాయనిధి నుండి ఆమె చికిత్స నిమిత్తం రూ. 2.50 లక్షలు మంజూరు చేయించారు.
మానస తండ్రి గతంలోనే మృతి చెందారు. అత్యంత నిరుపేద అయిన మానస బాసర ట్రిపుల్ ఐటీ లో నాలుగో సంవత్సరం చదువుతోంది. గత కొద్ది కాలంగా బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతోంది. దిక్కుతోచని స్థితిలో ఉన్న మానస కుటుంబ పరిస్థితిని తెలుసుకున్న వెంకట్.. వెంటనే ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ఎల్‌వోసీ మంజూరు అయ్యేందుకు వెంకట్ కృషి చేశారు.

ప్రస్తుతం మానస హైదరాబాద్ నిమ్స్ లో చికిత్స పొందుతోంది. మానస చికిత్స కోసం ఎల్‌వోసీ మంజూరు చేయించిన వెంకట్, తన అనుచరుల ద్వారా మానసకు ఎల్‌వోసీని అందించారు. ఈ సందర్భంగా సబ్బని వెంకట్ ను పలువురు అభినందిస్తున్నారు. అలాగే మానస అనారోగ్యం నుండి త్వరలోనే కోరుకోవాలని ఆకాంక్షించారు.