- మద్యం, మాదక ద్రవ్యాల బాధితుల చికిత్స కేంద్రాన్నీ ప్రారంభించిన వరంగల్ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య, పోలీస్ కమిషనర్
వేద న్యూస్, వరంగల్ :
మద్యం, మాదక ద్రవ్యాల బాధితుల చికిత్స కేంద్రాన్నీ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య పేర్కొన్నారు. గురువారం దేశవ్యాప్తంగా 41 మద్యం, మాదక ద్రవ్యాల బాధితుల చికిత్స కేంద్రాలను కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వశాఖ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మంత్రి డా. వీరేంద్రకుమార్ వర్చువల్గా ప్రారంభించగా, ఎంజీఎంలోని కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య, పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా, ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా మంత్రి , రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పంపిన సందేశాన్ని ఆసుపత్రి పర్యవేక్షకులు చంద్రశేఖర్ చదివి వినిపించారు.
మహిళ, పురుషులకు వేర్వేరుగా చికిత్స అందించడానికి పది పడకల చొప్పున వార్డు ఏర్పాటు చేసిన వార్డులను కలెక్టర్, సిపి లు ప్రారంభించి చికిత్స పొందుతున్న పేషెంట్స్ తో వైద్య సేవల గురించి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య మాట్లాడుతూ వరంగల్ జిల్లాలో ఎంజీఎం ఆసుపత్రిలో 50 బెడ్స్ తో మానసిక వైద్యశాల వార్డుతోపాటు మత్తు పదార్థాలకు బానిసలకు చికిత్సలు అందించడం జరుగుతున్నదని, డ్రగ్స్ ఆల్కహాల్ , టొబాకో బానిసలు సేవలుసద్వినియోగం చేసుకునేలా వివిధ ప్రచార మాధ్యమాల ద్వారా ప్రచారం కల్పించాలన్నారు.
ఈ కేంద్రంలో మద్యానికి, మాదక ద్రవ్యాలు(గంజాయి, డ్రగ్స్ నల్లమందు) లకు అలవాటుపడి బాని సలైన వారికి కౌన్సెలింగ్, చికిత్స అందిస్తా మన్నారు. అవసరమైన వారిని ఆసుపత్రిలో చేర్చుకొని చికిత్స. మందులు అందజేస్తామని పేర్కొన్నారు. ఉచితంగా అందింస్తున్నట్లు తెలిపారు. గత సంవత్సరం 210 మందికి ఈ వార్డులో చికిత్స అందించడం జరిగిందని, మత్తు పదార్థాలకు బానిసలైన చాలా కుటుంబాలు చికిత్సలు తీసుకోవడానికి ముందుకు రావడానికి సంకోచిస్తున్నారని దీనికి ప్రత్యామ్నాయంగా జిల్లా సంక్షేమ శాఖ మెప్మా సమన్వయంతో స్వయం సహాయక సంఘాల గ్రూపులసహకారంతో వారిలో అవగాహన కల్పించాలని అన్నారు.
పోలీస్ సహకారంతో మెడికల్ ,ఫారెస్ట్ ,పోలీస్ సమన్వయంతో అవగాహన కల్పించి వారికి చికిత్సలు అందించడంతో పాటు మత్తు పదార్థాలు సరఫరా కాకుండా చర్యలు తీసుకొంటున్నట్లు తెలిపారు.మత్తు పదార్థాలు బానిసలైన వారు ముందుకు వచ్చి చికిత్స తీసుకొని ఉత్తమ పౌరులుగా బయటకు బయటకు వచ్చి సమాజంలో ఒక వ్యక్తిగా గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు.
తదనంతరం వరంగల్ సిపి అంబర్ కిషోర్ ఝా మాట్లాడుతూ గతంలో తాను ఎస్పీ గా పని చేసినప్పుడు ఇక్కడ గుడంబాకి సమస్య ఉండేదని, ఇప్పుడు యువత గంజాయికు బానిసలుగా మారుతున్నారని అన్నారు. మెడికల్, పోలీస్ శాఖలు సమన్వయంతో పనిచేసి మత్తు పదార్థాలకు బానిసైన వ్యక్తులు బాధితులకు వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకొంటామన్నారు.
90 శాతం రోగాలు పొగాకు ఉత్పత్తులు వాడటం వల్ల వస్తున్నాయని హార్ట్ ఎటాక్ లివర్ డ్యామేజ్, నరాలు సంబంధించిన వ్యాధులున్నాయని,రైతులు గమనించి పండించొద్దని కోరారు. అంతకు ముందు రాష్ట్ర అటవీ దేవాదాయ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ పంపిన సందేశాన్ని ఎంజీఎం సూపరిండెంట్ ఆ చదివి వినిపిస్తూ ఎంజీఎం అభివృద్ధిని ముఖ్యంగా ఒక వరంగల్ బిడ్డగా నేనెప్పుడూ కోరుకుంటాను.. ఎంజీఎం నాకెప్పుడూ ప్రత్యేకము యువత ఎందరో నేడు ఈ వ్యసనాలకు బానిస కావడం వలన వారి కుటుంబాలు ఆగమవుతున్నాయి ఈ సమస్యలపై సరైన శిక్ష లభించడం ఎంతో అవసరం నా సొంత నిధుల నుండి కూడా నేను ఈ సౌకర్యానికి మరింత ఆర్థిక సహాయం అందిస్తాను ప్రజలందరూ ఈ సౌకర్యాన్ని వినియోగించుకోండి. ప్రజా ఆరోగ్యానికి ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యం ఇస్తుందని గత ప్రభుత్వం కెఎంసి మానసిక ఆరోగ్య విభాగానికి కేంద్రం అందించిన రూ.12 కోట్ల నిధులను 2018 నుంచి విడుదల కాకుండా జాప్యం చేసి అభివృద్ధిని అడ్డుకుందని ఈ నిధులను విడుదల చేయడానికి ప్రయత్నం చేసి మానసిక ఆరోగ్య చికిత్స అభివృద్ధికి తోడ్పాటున అందిస్తామని మానసిక ఆరోగ్య విభాగాన్ని సందర్శిస్తానని మంత్రి అన్నారు.
అనంతరం గంజాయి రహిత జిల్లాగా చేయుటకు తమవంతు సహకరిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంజీఎం సూపరిండెంట్ చంద్రశేఖర్, జిల్లా సంక్షేమ అధికారి శారద, మానసిక వైద్య నిపుణులు శ్రీనివాస్, కేఎంసి ప్రిన్సిపల్ మోహన్ దాస్, సంబంధిత అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.