• అయ్యా..ఈ నీళ్లు మీరు తాగుతారా?

వేద న్యూస్, ఎంజీఎం:

గ్రేటర్ వరంగల్ నగరంలోని ఎంజీఎం ఆస్పత్రిలో మంచి నీళ్లు తాగాలంటే..రోగులు, రోగుల బంధువులు వణికిపోతున్నారు. తాగు నీరు ఏర్పాటుచేసిన ప్రాంతంలో చుట్టూ మురుగునీరు చేరడంతో తాగునీరు కలుషితంగా, విధంగా మారుతోంది. దీంతో ఆ నీరు తాగాలంటే జనాలు జంకుతున్నారు. 

ఎంజీఎం ఆస్పత్రికి వరంగల్ జిల్లా చుట్టూ 50 నుంచి60 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చేవారు ఎక్కువగా ఉండడంతో దిక్కుతోచని స్థితిలో అదే నీరు తాగుతున్నారు. అయితే ఎంజీఎం సిబ్బంది,డాక్టర్లు కూడా ఇదే నీళ్లు త్రాగుతారా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు.

డ్రింకింగ్ వాటర్ అందించే చోట పరిశుభ్రంగా ఉంచాలని ఆస్పత్రి సిబ్బందిని, అధికారులను వేడుకుంటున్నారు. ఉత్తర తెలంగాణ ప్రజానీకానికి ఆరోగ్య వరప్రదాయినిగా, పెద్ద ఆసుపత్రిగా పేరుగాంచిన ఎంజీఎం ఆస్పత్రిలో కనీసం గా తాగు నీటి సదుపాయం సరిగా లేకపోతే ఎలా? అని రోగుల బంధువులు అడుగుతున్నారు. తాగునీరు కలుషితమయమై విషపూరితంగా మారుతుండడం పట్ల విస్మయం వ్యక్తం చేస్తున్నారు.