వేద న్యూస్, వరంగల్:

దీపావళి పండుగ సందర్భంగా గురువారం హనుమకొండ జిల్లా టి ఎన్ జి వో స్ యూనియన్ అధ్యక్షులు ఆకుల రాజేందర్, కార్యదర్శి సోమన్న, అసోసియేట్ అధ్యక్షులు వేణు లను, హనుమకొండ జిల్లా పంచాయతీ కార్యదర్శుల ఫోరం అధ్యక్షులు జనుగాని అశోక్ ఆధ్వర్యంలో కార్యదర్శులు కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

 

అనంతరం పంచాయతీ కార్యదర్శులు ఎదుర్కొంటున్న సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు.
 కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శుల ఫోరం జిల్లా కార్యదర్శి ఇంజపెల్లి నరేష్,అసోసియేట్ అధ్యక్షులు వెంకటేశం,ఉపాధ్యక్షులు వెంకన్న గౌడ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ అర్షం శ్రీనివాస్, హనుమకొండ డివిజన్ అధ్యక్షులు రఫీ,పరకాల డివిజన్ అధ్యక్షులు మనోహర్,కార్యవర్గ సభ్యులు యాదగిరి,రాజారాం,వేణుమాధవ్ పాల్గొన్నారు.