వేద న్యూస్, వరంగల్:
హనుమకొండ జిల్లా దామెర మండల పరిధిలోని లాదళ్ల గ్రామం చుట్టూ క్రషర్స్ ఉన్నాయని, క్రషర్స్ యాజమాన్యాలు పరిమితికి మించి తవ్వకాలు చేపట్టడంతో పాటు బ్లాస్టింగ్ చేస్తున్నారని ఆ గ్రామ యువ నేత పిట్టల రమేష్ ముదిరాజ్ పే ర్కొన్నారు. దీంతో గ్రామంలో భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయని వెల్లడించారు. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు అలసత్వం వహిస్తున్నారని ఆరోపించారు.
క్రషర్స్ యాజమాన్యాలు అధికారులకు మామూల్లు ఇస్తూ మేనేజ్ చేస్తున్నారని విమర్శించారు. క్రషర్స్ బ్లాస్టింగ్ వల్ల గ్రామంలోని ఇండ్లలో పగుళ్లు వస్తున్నాయని, తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వెల్లడించారు. మండల పరిధిలోని గ్రామాల్లో బెల్ట్ షాపులు విచ్చలవిడిగా వెళుతున్నాయని, వాటిపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు పట్టించుకోవడంలేదని ఆరోపించారు.