వేదన్యూస్ – శంషాబాద్
ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ఈరోజు మంగళవారం సీఎల్పీ సమావేశం శంషాబాద్ లోని నోవాటెల్ లో జరిగింది. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం తలపెట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకంలోని లబ్ధిదారులకు లక్ష సాయం తక్షణమే జమ చేస్తున్నట్లు ప్రకటించింది.
ఈ పథకంలో అర్హులైన తొలి పన్నెండు మంది లబ్ధిదారులకు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా లక్ష రూపాయల చెక్కును అందజేశారు. అయితే ఇందిరమ్మ ఇండ్లను నిర్మించుకునే లబ్ధిదారులకు బేస్ మెంట్ వరకూ ఇండ్లను నిర్మిస్తే లక్షరూపాయలు ఇవ్వనున్నారు.
గోడలు నిర్మించాక మరో లక్షా ఇరవై ఐదు వేల రూపాయలను ఇవ్వనున్నారు. అనంతరం స్లాబ్ వేశాక మరో లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. మొత్తం నిర్మాణం పూర్తయ్యాక మిగతా లక్ష ఇవ్వనున్నారు.