వేద న్యూస్, టేక్మాల్ :

మెదక్ జిల్లా టేక్మాల్ పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా హెచ్. అరవింద్ కుమార్
బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తామన్నారు. అసాంఘిక కార్యక్రమాలు జూదం, అక్రమ మద్యం తదితర వాటి పై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. వాహనానికి సంబంధించిన అన్ని పత్రాలు కలిగి ఉండి ద్విచక్ర వాహన దారులు హెల్మెట్ ధరించాలని సూచించారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది నూతన ఎస్సైకి శుభాకాంక్షలు తెలిపారు.