వేద న్యూస్, హైదరాబాద్ :

తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అలోక్ అరాధే ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో ఆదివారం ఉదయం 11 గంటలకు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్ ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, సీఎస్‌ శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్‌ యాదవ్‌, పలువురు మంత్రులు, ఐఏఎస్ అధికారులు, హైకోర్టు న్యాయమూర్తులు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో పాటు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా

తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధేకు గవర్నర్ తమిళిసై , సీఎం కేసీఆర్ పూలబొకేను అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.