Oplus_131072

వేద న్యూస్,మిర్యాలగూడ ప్రతినిధి :

దామరచర్ల మండలం తాళ్ల వీరప్ప గూడెం పవర్ ప్లాంట్ లో పనిచేస్తున్న ఉత్తరప్రదేశ్ వాస్తవ్యులు పుష్పదేవి చందన్..మూడవ కాన్పు కోసం గర్భిణీగా ఉంది.నొప్పులు రావటంతో 108 ద్వారా మిర్యాలగూడ ఏరియా హాస్పిటల్ కు తరలిస్తున్న క్రమంలో మార్గం మధ్యలో పురిటి నొప్పులతో బాధపడుతుండడంతో అంబులెన్స్ లో డెలివరీ చేశారు. డెలివరీలో మగ బిడ్డకు జన్మనివ్వగా తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని ఈఎంటి వెలిజాల సైదులు,పైలెట్ అరుణ్ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబులెన్స్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అని అన్నారు.