వేద న్యూస్, డెస్క్:
వాహనాల తనిఖీల్లో పోలీసులు రూ.16 లక్షలా 50 వేల సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ సమీపం లోని రాయికల్ టోల్ ప్లాజా వద్ద రాత్రి పోలీసులు చేసిన తనిఖీల్లో ఆర్టీసీ బస్సు లో ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న నగదు తో పాటు వెండి ని సీజ్ చేశారు. వనపర్తి నుండి హైదరాబాద్ కు బస్సులో వెళ్తున్న జయదేవ్ అనే
యువకుడి వద్ద 16 లక్షల 50వేల నగదు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పట్టుబడ్డ నగదుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో పోలీసులు వాటిని సీజ్ చేశారు. ఈ నగదును కలెక్టరేట్ లోని ట్రెజరీకి పోలీసులు పంపనున్నారు.