• కాంగ్రెస్ నాయకులు మీసాల ప్రకాష్

వేద న్యూస్, వరంగల్ టౌన్ :

వరంగల్ తూర్పు నియోజకవర్గం ప్రతాప్ నగర్ లోని అంబేద్కర్ భవన్ లో 6 గ్యారంటీల ధరఖస్తు స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్న 18వ డివిజన్ కాంగ్రెస్ నాయకులు టీపీసీసీ కార్యదర్శి మీసాల ప్రకాష్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం తొందరలోనే 6 గ్యారెంటీ లను ప్రజలకు అందించే దిశగా ప్రయత్నాలు చేస్తోందన్నారు.

వచ్చిన అవకాశాన్ని అందరూ తప్పకుండా ఉపయోగించుకోవాలి అని కోరారు.ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు సందెల లాజర్, ఈసంపెళ్లి ప్రభాకర్, మార్పట్లసాయికుమార్, గిరి పుష్ప , బొక్క భాస్కర్, ఐత సురేష్, బైరపాక డేవిడ్ రాజ్, జన్ను అరవింద్, గబ్బెటి సుధాకర్, కొల్లూరి శ్రీధర్, కొల్లూరి బన్నీ విశాల్, మేకల శ్యామల, మహిళా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.