వేద న్యూస్, వరంగల్ టౌన్:
గ్రేటర్ వరంగల్ ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం వరంగల్ రామన్నపేటలోని మణిద్వీప్ గార్డెన్లో అంగరంగ వైభవంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షులు ఎస్ కె హుసేన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లడే రవి,ఉమ్మడి జిల్లా అధ్యక్షులు లింగమూర్తి,గ్రేటర్ వరంగల్ వ్యవస్థాపక అధ్యక్షులు రంగు సదానందం, నూతన గ్రేటర్ వరంగల్ అధ్యక్షులు భూపతి సూరిబాబు జ్యోతి ప్రజ్వల చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అనంతరం నూతనంగా ఎన్నికైన కార్యవర్గం చేత ప్రమాణ స్వీకారం చేయించారు.గ్రేటర్ వరంగల్ పరిధిలో ఉన్న ఫోటో, వీడియో గ్రాఫర్స్ హక్కుల సాధనకు కృషి చేస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో నూతన కమిటీ ప్రధాన కార్యదర్శి బిల్లా రమేష్,కోశాధికారి పాటి రాజు, కార్య నిర్వాణధికారి కట్ల రాజు,కార్యవర్గ సభ్యులు,ఫోటోగ్రాఫర్స్,తదితరులు పాల్గొన్నారు.