వేద న్యూస్, ఎల్కతుర్తి:
ఎల్కతుర్తి మండల పరిధిలోని చింతలపల్లి గ్రామంలో బతుకమ్మ సంబరాలు మహిళలు ఘనంగా నిర్వహించుకున్నారు.

గ్రామంలోని వేప చెట్ల కింద మహిళలు కోలాహలంగా వేడుకలు జరుపుకున్నారు. పూల సింగిడి… సందర్భంగా “ఒక్కేసి పువ్వేసి వేసి చందమామ” అంటూ చక్కగా బతుకమ్మ పాటలను పాడుకున్నారు.
అనంతరం పలు పాటలకు లయబద్ధంగా నృత్యాలు చేసారు.