• 50 వేల మెజారిటీ తథ్యం: తోకల ధీమా
  •  నామినేషన్ దాఖలు చేసిన శ్రీనివాస్ రెడ్డి

వేద న్యూస్, రాజేంద్రనగర్:
రాజేంద్రనగర్ లో బీజేపీ గెలుపు 50 వేల మెజారిటీతో తథ్యమని ఆ పార్టీ నియోజకవర్గ అభ్యర్థి తోకలా శ్రీనివాస్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గురువారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి మైలార్ దేవ్ పల్లి హనుమాన్ దేవాలయంలో నామినేషన్ పత్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ర్యాలీగా నామినేషన్ వేయడానికి బయలుదేరి వెళ్లారు. రాజేంద్రనగర్ ఆర్డీవో రిటర్నింగ్ కార్యాలయం వరకు మహిళలతో ర్యాలీగా వెళ్లి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఅర్ఎస్ పార్టీ ప్రజలను ఏవిధంగా మోసం చేస్తుందో ప్రజలు చూస్తున్నారన్నారు. ప్రజల ఆశీర్వాదంతో రాజేంద్రనగర్ నియోజకవర్గంలో బీజేపీ జెండా ఎగరవేస్తామని చెప్పారు. ప్రజలందరూ స్పష్టంగా ఉన్నారనీ, బీఅర్ఎస్ పార్టీ ప్రజలను మాటలతో ఏ విధంగ మభ్యపెడుతుందో ప్రజలకు అవగాహన ఉందని పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వంప్రజల కష్ట పరిస్థితులు ఉన్నప్పుడు ఉచిత రేషన్ బియ్యం, కరోనా వ్యాక్సిన్స్ వంటివి అందిస్తూ వచ్చిందని వెల్లడించారు. ఆయుష్మాన్ భవ పేరుతో ఉచిత వైద్యాన్ని అందిస్తూ ఇలా అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు కల్పిస్తున్నారని వివరించారు. ప్రజలు భారతీయ జనతా పార్టీని గెలిపించేందుకు సిద్ధమయ్యారని తెలిపారు. తనకు అవకాశం ఇచ్చిన జాతీయ పార్టీ నాయకులకు, వేలాది మంది నియోజకవర్గ ప్రజలు, అభిమానులు, కార్యకర్తలు నామినేషన్ కు తండోపతండాలుగా ఆశీర్వదించాలని కృతజ్ఞతలు తెలిపారు.

ఈ ర్యాలీయే తన విజయ చిహ్నమని, రాజేంద్రనగర్ నియోజకవర్గం లో భారతీయ జనతా పార్టీ జెండా పాత బోతున్నామని, 50 వేల మెజారిటీతో గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమానికి వచ్చిన కేంద్ర కమ్యునికేషన్ మంత్రివర్యులు దేవుసిణ చౌహాన్, రాష్త్ర, జిల్లా, మండల, మున్సిపాలిటీ, డివిజన్, నాయకుల కార్యకర్తలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. దశాబ్దాలుగా వివక్షకు గురవుతున్న రాజేంద్రనగర్ నియోజకవర్గం అభివృద్ది కోసం నిరంతరం కృషి చేస్తామని తోకల హామీ ఇచ్చారు.