- ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్ (ఎల్టా) మహబూబాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి బయగాని రామ్మోహన్
వేద న్యూస్, మరిపెడ:
ఎల్టా తెలంగాణ ఎస్సీఈఆర్టీ, భారతి ఫౌండేషన్ వారి సహకారంతో శనివారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎజుక్వెస్ట్, ఇంగ్లి ష్ ఒలంపియాడ్ పోటీ పరీక్షలు పాఠశాల స్థాయిలో వారి వారి పాఠశాలలో నిర్వహించ బడతాయని మహబూబాబాద్ జిల్లా ఎల్టా జనరల్ సెక్రెటరీ బయగాని రామ్మోహన్ అన్నారు.
ఈ పరీక్షల ద్వారా విద్యార్థులలో సృజనాత్మక ప్రసంగాలు, ఆంగ్లభాష నైపుణ్యాలను పెంపొందించడం జరుగుతుందని చెప్పారు. ఈ పరీక్షలలో 6,7,8 తరగతులను జూనియర్ కేటగిరీగా, 9,10 తరగతులను సీనియర్ క్యాటగరీగా తీసుకోవడం జరుగుతుందని అన్నారు.
ఈ పోటీలలో ప్రభుత్వ, జిల్లా పరిషత్, మోడల్ స్కూల్ మరియు కేజీబీవీ పాఠశాలల విద్యార్థులు పాల్గొంటారని, అందువలన ఆయా పాఠశాలల ప్రిన్సిపల్స్, హెడ్మాస్టర్స్, స్పెషల్ ఆఫీసర్స్, ఆంగ్ల ఉపాధ్యాయులకు సహకరించి విద్యార్థుల ఆంగ్ల నైపుణ్యాన్ని పెంపొందించి, ఇంగ్లీష్ ఒలంపియాడ్ ని విజయవంతం చేయాలని కోరారు.