వేద న్యూస్, ఎల్కతుర్తి:
తెలంగాణ రైతు రక్షణ సమితి(టీఆర్ఆర్ఎస్) రాష్ట్ర అధ్యక్షుడు పాకాల
శ్రీహరి రావు ఆదేశాలు, ఉమ్మడి వరంగల్ జిజిల్లా అధ్యక్షులు వరికెల కిషన్ రావు సూచన మేరకు రక్షణ సమితి హనుమకొండ జిల్లా సలహాదారుగా సుకినె సుధాకర్‌రావును నియమించినట్టు కిషన్‌రావు తెలిపారు.

శుక్రవారం సుధకార్‌రావుకు నియామక పత్రాన్ని ఆయన అందజేశారు. కార్యక్రమంలో హనుమకొండ జిల్లా రక్షణ సమితి అధ్యక్షులు భాస్కర్ హింగె, నాయకులు రామారావు, మాధవరావు,లస్కర్ మధుకర్, కోలే విజయ్ కుమార్ పాల్గొన్నారు.

తన నియామకానికి సహకరించిన రాష్ట్ర అధ్యక్షులు పాకాల శ్రీహరి రావు, ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు కిషన్ రావు, హనుమకొండ జిల్లా అధ్యక్షులు భాస్కర్‌లకు సుధాకర్‌రావు కృతజ్ఞతలు తెలిపారు. తన సలహాదారుగా బాధ్యతల్లో భాగంగా రైతులకు ఎదురయ్యే సమస్యలను అధికారులకు తెలియజేసి..పరిష్కారం కావడంలో తన వంతు శ్రమ కొనసాగిస్తానని సుధాకర్ పేర్కొన్నారు.